(Presented by: Srinivas Chimata) APTA American Progressive Telugu Association అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ Web Site: www.ap-ta.org Contact Email ID: apta.admin@gmail.com (Presented by: Srinivas Chimata)
సామాజిక సేవయే పరమావధిగా భావించే వందలాది ఔత్సాహికులైన ప్రవాసాంధ్రులు సమిష్టిగా అమెరికాలో జనవరి 2008లో ఏర్పరుచుకున్న సంస్థయే ఆప్త. అమెరికాలోని మిగతా జాతీయ తెలుగు సంఘాలకు విభిన్నంగా తనదైన శైలిలో పనిచేస్తూ ప్రతి యేడాది తెలుగునాట కడు పేదరికంలో మగ్గుతున్న వందలాది ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఆప్తబంధువుగా నిలిచి అకుంఠితమైన సేవా దృక్పధంతో వారి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్న సంస్థ.
అమెరికాలోని Kansas రాష్ట్రంలో 2008 లో 501C(3) - Non Profit Organizationగా ఏర్పడింది (For Tax Exemptions: ID is 26-2189788) Founder Board Chair: ప్రసాద్ సమ్మెట (Kansas) Founder Exec. President: శ్రీనివాస్ చందు (Virginia) Present Board Chair: శ్రీనివాస్ చిమట (California) Present Exec. President: వెంకట్ చలమలశెట్టి (Virginia)
2008 నుండి 2013 వరకు దాదాపు 300 ప్రతిభావంతులైన ఆంధ్రప్రదేశ్ లోని పేద విద్యార్ధులకు 90 వేల డాలర్ల విద్యావసర విరాళాలు అందించిన సంస్థ. అమెరికాలో పలు ప్రాంతాలలో ప్రతి యేడాది పిక్నిక్ లు, Get-togethers జరుపుకుంటూ అత్యంత ఆత్మీయతతో మెలుగుతున్న ఆప్త మిత్రులు. 2014/2015 లలో ప్రప్రధమ National Convention ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న చురుకైన కార్యకర్తలు.
అమెరికాలో ఎవరైనా ఒక పట్టణం నుండి వేరే పట్టణానికి వెళ్ళినప్పుడు కావలిసిన Relocation సహాయాన్ని పొందడానికి ఆయా పట్టాణాలలో ఉన్న ఆప్త కార్యవర్గ సభ్యులైన ఆప్తబంధువులకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. వారు వెంటనే సోదరభావంతో కావలిసిన సహాయ సహకారాలు అందిస్తారు. ఇండియా నుండి పై చదువులకు అమెరికా యూనివర్సిటీల లేదా H1 వీసా వివరాలు కావాలన్నప్పుడు ఒక్క Email (apta.admin@gmail.com) ఆప్తా కు పంపితే చాలు.. స్వల్పకాలంలోనే ఉపయోగకరమైన విషయ సమాచారం లభ్యమవ్వడం ఖాయం.
అమెరికాలో ఉంటున్న స్టూడెంట్లకు H1 వీసా వివరాలు కావాలన్నా లేదా H1, L1 తదితర వీసాల మీద ఉన్నవారికి Green Card పొందే విషయ సేకరణ కూడా ఆప్త ద్వారా చాలా సుసాధ్యం. అలాగే అమెరికాలో ఉంటున్న ఆప్తులకు Career & Immigration విషయాలలో కావలసిన సహాయ సహకారాలను అందిస్తున్నది. అమెరికాలో ఎప్పటినుండో స్థిరపడ్డ తెలుగువారందరినీ ఒక network ద్వారా సంఘటితపరుస్తూ వారి పిల్లల చదువుల, పెళ్ళిళ్ళ విషయాలలో వారిని పరస్పరం కలుపుతూ ఆప్త ఎంతగానో వారికి సహాయపడుతున్నది.
ముఖ్యంగా ఆప్త మెంబర్లలో ఎవరికైనా దురదృష్టకరమైన సంఘటనలు (ఉదాహరణకు కారు ప్రమాదాలు, ఆకస్మిక మరణాలు, కుటుంబ అత్యవసర పరిస్థితులు కావచ్చు) సంభవించినా, ఆప్త సంస్థ వారి కుటుంబ సభ్యుల వెన్నంటే ఉండి కావలసిన Moral, Financial Support ను అత్యంత త్వరతగతిన అందిస్తుంది. 2009 లో వర్జీనియాలోని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సలాది మోహన్ అకాల దుర్మరణం పొందినప్పుడు ఆప్తులందరూ కలిసి పది వేల డాలర్ల విరాళాలను రెండు రోజుల్లో సేకరించి అతని కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలబడ్డారు.
2009 లో ఒక ఆప్త స్టూడెంట్ సుదీప్తి చికాగోలోని తన అపార్ట్ మెంట్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగినప్పుడు, ఆప్త $500 విరాళాలు సేకరించి తక్షణ సహాయం అందచేసింది. 2012లో ఆప్త వెబ్ డిజైనర్ రాము లంకాగారి సోదరుడు ప్రమాదకరమైన వ్యాధితో ఆకస్మిక మరణం పొందినప్పుడు, కొంత మంది ఆప్త మిత్రులు $2200 సేకరించి వారి పిల్లల విద్యావసరాల నిమిత్తం Fixed Depositలో వేశారు.
ఒక్కప్పటి ప్రఖ్యాత రంగస్థల & సినిమా నటులైన ఈలపాట రఘురామయ్యగారి స్వగ్రామమైన గుంటూరు జిల్లా బాపట్లలో వారి విగ్రహావిష్కరణ నిమిత్తం $1000 విరాళాలను 2012లో ఆప్త సంస్థ అందజేసింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతం 2009లో వరద ముంపుకు గురైన సందర్భంలో వేలాది నిరాశ్రయులైన వరద బాధితులకోసం ఆప్తా $2000 విరాళాలను సేకరించింది.
"మానవసేవయే మాధవసేవ" అన్న ఒక సత్సంకల్పంతో ఏర్పడిన ఈ సంస్థలో వెంటనే మెంబర్ గా చేరి సంస్థ సేవా తత్పరణలో మీరూ భాగస్వాములు కండి! మరిన్ని వివరాలకు ఆప్తా వెబ్ సైట్, www.ap-ta.org ను వెంటనే visit చేయండి. Email ID: apta.admin@gmail.com పేద విద్యార్ధులకు అందించబడే విరాళాల వివరాలు వెబ్ సైట్ లో చక్కగా పొందు పరచబడ్డాయి. మీరు ఆప్త సంస్థ కు దానం చేసే ప్రతి డాలర్ ను సద్వినియోగపరచడం ఆప్త ప్రధమ కర్తవ్యం. మీరు వెబ్ సైట్ లోని PayPal Donate లింకులపై క్లిక్ చేసి పేద విద్యార్ధులకు సత్వరమే సహాయపడవచ్చు.